Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒరిస్సా రైలు ప్రమాదానికి మూల కారణం అదే : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

odisha rail accident
, ఆదివారం, 4 జూన్ 2023 (13:57 IST)
ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మూల కారణాన్ని గుర్తించామని, అయితే ఇపుడు దాన్ని బిహిర్గతం చేయడం భావ్యం కాదని  కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆయన రెండో రోజు కూడా పర్యటించి, సహాయక చర్యలను వేగవతమయ్యేలా చర్యలు తీసున్నారు. ప్రమాద స్థలాన్ని ఆయన మరోమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌‌లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. 
 
రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. 
 
బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోలను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆదివారం రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించాసమని తెలిపారు.
 
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం