జీహెచ్ఎంసీ ఎన్నికలు : మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (14:41 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)కి డిసెంబరు నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో అభ్యర్థులు, ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలతో పాటు నామినేషన్లు, ప్రచారపర్వానికి సంబంధించిన అంశాలపై అందులో స్పష్టం చేసింది. 
 
జీహెచ్​ఎంసీ యాక్టును అనుసరిస్తూ గతం మాదిరిగానే ఈసారి కూడా జనరల్​ కేటగిరీలోని అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ ​సొమ్ముగా నిర్ధారించింది. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. 
 
ప్రతిపాదిత, బలపర్చే అభ్యర్థులు స్థానికంగా ఉన్న వార్డులకు చెందినవారు కావాలని, వార్డుల జాబితాలో ఓటు హక్కు ఉన్నవారే ప్రతిపాదించాల్సి ఉంటుందని పేర్కొంది. గ్రేటర్​లో ఓటు హక్కు ఉన్న వారు ఏ వార్డుల్లోనైనా పోటీ చేసేందుకు అర్హులని తెలిపింది. 
 
అంతేకాకుండా, జనవరిలో నిర్వహించిన కొంపల్లి మున్సిపల్​ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఫేస్​ రికగ్నైజ్​ పోలింగ్​ను చేపట్టి 80 శాతం సక్సెస్​ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు గ్రేటర్​ ఎన్నికల్లో ప్రతి వార్డులోని ఒక పోలింగ్​ కేంద్రంలో ఫేస్​ రికగ్నైజ్​ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 
 
ముఖ్యంగా, పాతబస్తీ పోలింగ్​ కేంద్రాల్లో ఈ విధానాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటరు జాబితా, పోలింగ్​ కేంద్రాల ముసాయిదా నేపథ్యంలో గ్రేటర్​ అధికారులు ఫేస్​ రికగ్నైజ్​ సెంటర్​ ఏర్పాటు చేసే జాబితాను సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సామగ్రి, ఇంటర్నెట్​ ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి ఈ కేంద్రాలు ఖరారు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పాతబస్తీలో ఈ కేంద్రాల ఏర్పాటును వద్దని కోరుతూ ఇప్పటికే ఎంఐఎం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 
 
దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని వార్డుల్లో ఒక్క సెంటర్​లో ఫేస్​ రికగ్నైజ్​ ఏర్పాటు చేస్తుండగా పాతబస్తీ పరిధిలోని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని, అభ్యంతరం వ్యక్తం చేసే ఓటర్లకు మినహాయింపు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments