Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్దర్ మారిపోయారు... చేతిలో బుద్ధుడి జెండా, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్...

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా... అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన గద్దర్ మారిపోయారు. గత దశాబ్దాలుగా ఎర్రజెండాను భుజాన వేసుకుని, నల్ల కండువాను వేసుకుని కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజల్లో సానుభూతిని

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (17:48 IST)
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా... అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన గద్దర్ మారిపోయారు. గత దశాబ్దాలుగా ఎర్రజెండాను భుజాన వేసుకుని, నల్ల కండువాను వేసుకుని కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజల్లో సానుభూతిని రగిలించిన గద్దర్ వైఖరిలో మార్పు వచ్చేసింది. ఈమధ్య గద్దర్‌ ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ఫోటోను చూసిన మార్క్సజం నాయకులు షాక్ తిన్నారు. 
 
ఇంతలోనే మరో షాక్ ఇస్తూ తను మావోయిస్టు సిద్ధాంతాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వ్యవస్థపై ఆధారపడిన ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు చేతిలో ఎప్పుడూ వుండే ఎర్ర జెండాను వదిలేసి బుద్ధుడు వున్న జెండాను ఆయన చేతబూనారు. 
 
ఇటీవలే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి తనకు ఎంతగానో నచ్చుతోందని కూడా చెప్పారు. మొత్తమ్మీద రాబోయే కాలంలో ఇటు ఆంధ్రలో పవన్, అటు తెలంగాణలో గద్దర్-కోదండరామ్ కలిసి ముందుకు నడిచే అవకాశం వున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments