Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం.. ఏప్రిల్ ఒకటి నుంచే ఫ్రీ..

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:57 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని క్షురకులు, రజక వృత్తిదారులు ఉపశమనం పొందేలా తీపికబురు చెప్పారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తామని, అదీకూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. 
 
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గల కటింగ్‌ షాపులకు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఙప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డిని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీఓను జారీ చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్‌ 1వ తారీఖు నుంచే అమల్లోకి రానుంది. 
 
ఈ సందర్భంగా అత్యంత బలహీనవర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామస్థాయి నుంచి జీహెచ్‌ఎంసీ వరకు అన్ని హెయిర్‌ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments