భాగ్యనగరిలో ఉచిత మంచినీటి సరఫరా... ఇంటికి 20 వేల లీటర్లు ఫ్రీ

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:03 IST)
హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకం మంగళవారం నుంచి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా ఇదొక హామి. ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్లలోపు నీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా, మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. 
 
ఇప్పటికే ఫ్రీ వాటర్‌ నీటిని పొందే వినియోగదారులు నల్లా కనెక్షన్‌, క్యాన్‌ నంబరు (క్యాన్‌) ఆధార్‌ నెంబరు లింకు చేయడంతో పాటు నల్లాకు నీటి మీటర్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటగిరీల వారీగా గైడ్‌లైన్స్‌లను జారీ చేసిన సర్కారు ఇందుకు మీ సేవా కేంద్రాలు లేదా WWW.HMWSSB.COM వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా నల్లాలకు మార్చి 31లోగా విధిగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 
 
ఇందుకోసం జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించారు. అలా ఏర్పాటు  చేసుకున్న వారికి 20 వేల లోపు నీటి వినియోగం ఉంటే నీటి సరఫరా ఉచితంగా ఉంటుంది. పథకం గురించి, అవసరమైన సేవలను అందించేందుకు వాటర్‌ బోర్డు ‘కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌' కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేనేజ్‌మెంట్‌ వారు 155313 ఫోన్‌ నంబరులో అందుబాటులో ఉంటారు. ఆధార్‌ అనుసంధానం, మీటర్ల బిగింపు అనంతరం ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి మంచినీటి బిల్లుల జారీ  ఉంటుంది. 20వేల లోపు నీటి వినియోగం ఉన్న వారికే ఉచిత నీటి సరఫరా వర్తిస్తుంది.
 
మరోవైపు, ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఆమలులో భాగంగా ఈ ఫ్రీ వాటర్‌ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తలసాని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. సుమారు 70 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందుతారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments