Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. సిద్ధంగా ఉండాలి : కేటీఆర్

Advertiesment
TS Minister KTR
, సోమవారం, 7 డిశెంబరు 2020 (08:02 IST)
దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓడిన డివిజన్లలో ఓడిన వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. 
 
సిట్టింగ్‌లను మార్చిన దగ్గర గెలిచామన్న ఆయన.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఇక్కడే లెక్క తప్పిందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని, గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకిన పురుషుల్లో అంగస్తంభన సమస్య???