Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు పూజలు.. అబ్బబ్బా మూఢనమ్మకాల గోల.. వ్యక్తి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:18 IST)
ఆధునికత పెరిగినా, స్మార్ట్ ఫోన్ల యుగం వచ్చినా మూఢనమ్మకాల గోల ఆగట్లేదు. తాజాగా మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
నిందితుడి గురువారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 
 
ఈ విషయంలో నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆర్‌.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలతో నయం చేస్తానని నమ్మించాడు. 
 
ఇందుకోసం బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. అయితే పూజ చేయకుండా వ్యక్తి మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు.. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. అతడు ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments