మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Webdunia
గురువారం, 16 జులై 2020 (07:38 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద నుంచి అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్‌, ఆర్డీవో ఈశ్వరయ్య, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 
ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు కూలీలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అంబోతులా తండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో హర్యా, గోవిందర్, మధు, ధూర్యా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 తొక్కిసలాటలో గాయపడి శ్రీతేజ్ ను మరోసారి పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహా రెడ్డి

Lavanya Tripathi: షూటింగ్ తర్వాత, నేను చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లేదాన్ని: లావణ్య త్రిపాఠి కొణిదెల

Jo Sharma: బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం: జో శర్మ

Avika Gor: విషపూరిత ప్రేమ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ ట్రైలర్ ఆవిష్కరణ

Bhagyashree Borse: శివకార్తికేయన్ చిత్రం సెయాన్ లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments