బిర్యానీ తిందామని వెళ్లిన నలుగురు.. చివరికి వరదలో చిక్కుకుని..?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (10:35 IST)
బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు. అలా మాంచి బిర్యానీ లాగించాలనుకున్న నలుగురు స్నేహితులు జనగామలో ఏదైనా బిర్యానీ సెంటర్‌లో డిన్నర్‌ చేసేందుకని కారులో ప్రయాణమయ్యారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో వారు బయలుదేరారు. 
 
జనగామ-హుస్నాబాద్‌ రహదారిపై వడ్లకొండ గ్రామం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని పోలీసులు వారించినా కల్వర్టు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వరద నీటి ఉద్ధృతితో కారు కొట్టుకుపోవడంతో నలుగురు యువకులు వరద నీటిలో చిక్కుకొన్నారు. 
 
అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వడ్లకొండ శివారు సుందరయ్యనగర్‌కు చెందిన రెడ్డబోయిన నరేశ్‌, రెడ్డబోయిన కనకరాజు, మరిగడికి చెందిన పుట్ట రవి, వట్నాల వెంకటేశ్‌ ఉదంతమిది. పోలీసు సిబ్బంది హెచ్చరించినా.. అత్యుత్సాహంతో కారు నడపటంతో వరద ఉద్ధృతికి ఆ వాహనం సుమారు అర కిలోమీటరు వరకు వాగులో కొట్టుకెళ్లింది. వాగు మధ్యలో ఉన్న తాటిచెట్టు కారును అడ్డుకుంది.
 
కారులోని ఒకరి చరవాణి ద్వారా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారమందించారు. వెంటనే గ్రామస్థులు, పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించగా అందరూ హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు చాలాసేపు పోరాడి వారిని కాపాడారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments