Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధృతంగా గోదావరి : ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (08:58 IST)
తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు ఎగువున కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఈ కారణంగా రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భక్తులు నదిలో స్నానాలను నిషేధించారు. పుష్కరఘాట్‌ వద్దే ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 
అలాగే, తెలంగాణ, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నారం బరాజ్‌కు 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు 56 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటిమట్టం 4.28 టీఎంసీలుగా కొనసాగుతోంది.
 
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9,26,849 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 8,71,395 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 7.259 టీఎంసీలుగా ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments