కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం - కొందరికి గాయాలు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (08:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులతో పాటు మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించిన అధికారులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 
 
భూపాలపల్లి కేటీపీసీలో 500 మెగా యూనిట్ల ఉత్తత్తి కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌ పంపించే మిల్లులో ఉండే ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. ఈ పేలుడు కారణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ వైపు మంటలలను అదుపు చేసే పనిని కూడా చేపట్టిన అధికారులు, మరోవైపు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments