Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి కొత్తగూడెం సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం..

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (12:30 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. గత సంవత్సరం ఇదే సబ్ స్టేషన్ విద్యుత్ కేబుల్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు
 
ఇక సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. 
 
అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం విస్తరించడంతో ఇప్పటికే సబ్ స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది.  పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments