Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయం కోసం దొంగ వసూళ్లు, దొంగ పుస్తకాలు, మాకు భద్రాచలం రాముడున్నాడు, ఎవరు?

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (20:08 IST)
అయోధ్య రాముడిని రాజకీయ లాభాల కోసం భాజపా ఉపయోగిస్తోందని, డబ్బు వసూలు చేసిన తరువాత నకిలీ రశీదులు ఇస్తున్నారని ఆరోపిస్తూ పరకాల టిఆర్ఎస్ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ఆదివారం మరోసారి వ్యాఖ్యానించారు. కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు తర్వాత ఫండ్ కలెక్షన్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన రెండవ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆయన.
 
అయోధ్యలోని రామాలయం పేరిట నిధులు సేకరించడానికి నకిలీ పుస్తకాలు సిద్ధం చేశారని ధర్మారెడ్డి ఆరోపించారు. అయోధ్య ఆలయానికి నిధుల వసూలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేసారు. "సర్దార్ పటేల్ విగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,900 కోట్లు ఖర్చు చేసినప్పుడు, అయోధ్య కోసం మరో 11 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయలేదు" అని ఆయన ప్రశ్నించారు.
 
ధర్మారెడ్డి మాట్లాడుతూ, “బిజెపి నాయకులు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేయడం దారుణం. నిధుల సేకరణకు సరైన డాక్యుమెంటేషన్ చూపించిన తర్వాత మాత్రమే వారు విరాళాల సేకరణ ప్రారంభించాలి. విరాళాల పేరిట ప్రజలను బెదిరిస్తున్నారు. నేను రాముడి నిజమైన భక్తుడిని, ఆయన కోసం నా ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించాను "అని ఆయన అన్నారు. అసలు మాకు భద్రాచలంలో శ్రీరాముడు వుండగా అయోధ్య రాముడి కోసం విరాళాలు ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు.
 
ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బిజెపి వరంగల్ పట్టణ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ నేతృత్వంలోని బిజెపి నాయకులు హనమకొండలోని ధర్మారెడ్డి నివాసంపై రాళ్ళు రువ్వారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో, ‘జై శ్రీ రామ్’ అంటూ నినాదాలు చేస్తూ, ధర్మారెడ్డి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. అనంతరం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments