Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం.. వాడుకుని చేతులెత్తేశాడు.. ఫోన్ చేస్తే భార్య..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (13:19 IST)
ఫేస్‌బుక్ పరిచయం ఆ యువతి కొంపముంచింది. ఫేస్‌బుక్ పరిచయంతో ఓ మ్యూజిక్ టీచర్ మోసపోయింది. పెళ్లి పేరుతో లొంగదీసుకుని.. పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. వివరాల్లోకి వెళితే.. వివరాల్లోకి వెళ్తే కరణ్ కాన్సెప్ట్‌‌కు చెందిన కరణ్ రెడ్డి చెరుకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్న యువతికి ఫేస్‌బుక్‌లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. దానిని ఆమె యాక్సెప్ట్ చేసింది. 
 
కొన్ని రోజుల పాటు చాట్‌ చేసుకున్న అనంతరం వారు మంచి స్నేహితులు అయ్యారు. ఆమె అతన్ని స్నేహితుడిగా భావించి తన కుటుంబం, ఆర్థిక సమస్యలన్నింటినీ పంచుకునే స్థాయికి వెళ్ళింది. అతను ఆమె ఆర్థిక పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నాడు. ఆమెను తన కార్యాలయానికి పిలిచాడు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ తన కార్యాలయంలో ఆమెతో బలవంతంగా లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు.
 
అంతా అయిపోయాక అతను ఆమెను ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌‌లో బ్లాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె కరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెకు కరణ్ భార్య మానస ఫోన్ చేసి తన భర్తను మరచిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. దానికి ఆమె నిరాకరించడంతో వారు బెదిరింపులు మొదలు పెట్టారు. దీంతో యువతీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం