Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త నోట్లో పురుగుల మందు పోసి... గొంతు నులిమి చంపేసిన భార్య!

Advertiesment
భర్త నోట్లో పురుగుల మందు పోసి... గొంతు నులిమి చంపేసిన భార్య!
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (10:11 IST)
తన ప్రియుడుతో కలిసి పడకసుఖం పంచుకునేందుకు భర్త అడ్డుగా ఉన్నాడనీ భావించిన భార్య.. కట్టుకున్నోడి నోట్లో పురుగుల మందు పోసి, గొంతు నులిమి హత్య చేసింది. ఈ దారుణం నల్గొండ జిల్లా పెద్దావూర మండలంలోని సర్వేదుల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పీఏపల్లి మండలం నంభాపురం గ్రామానికి చెందిన రమావత్‌ స్వామి(35)కి పెద్దవూర మండలం బాసోనిబావి తండాకు చెందిన పుష్పలతతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప(8), బాబు(10) ఉన్నారు. పర్వేదుల గ్రామంలో స్వామి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో సంభాపురానికి చెందిన రవి అనే వ్యక్తితో పుష్పలతకు కొంతకాలం క్రితం వివాహేతర బంధం ఏర్పడింది. వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం ఈ నెల 21న స్వామి కంటపడటంతో అతడు వారితో గొడవపడ్డాడు. స్వామిని అడ్డు తొలగించుకుంటేనే తమ బంధం కొనసాగుతునందని భావించిన పుష్పలత, రవి.. అదే రోజు రాత్రి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నోట్లో పురుగుల మందు పోశారు.
 
తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుష్పలత చెప్పిన విషయాన్ని అందరూ నమ్మారు. తన కుమారుడు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని ఈ నెల 22న స్వామి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఈ క్రమంలో గొంతుపై కమిలిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
 
దాంతోపాటు, స్వామి మృతికి పురుగుల మందు కారణం కాదని నివేదికలో తేలింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో ప్రియుడితో కలిసి పుష్పలత పరారయ్యేందుకు యత్నించింది. పెద్దవూర వై జంక్షన్‌లో పోలీసులకు చిక్కింది. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌కు బ్రిటన్ భయం .. కరోనా స్ట్రెయిన్ కలకలం...