Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.. తల్లిలాంటి పార్టీని వీడాల్సిన పరిస్థితి: కన్నీళ్లు పెట్టుకున్న?

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి బాటలోనే మరికొందరు పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. అయితే టీడీపీని వీడటం ఇష్టం లేకపోయినా.. రేవంత్ రెడ్డి లేకప

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:00 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి బాటలోనే మరికొందరు పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. అయితే టీడీపీని వీడటం ఇష్టం లేకపోయినా.. రేవంత్ రెడ్డి లేకపోవడంతో ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు భావోద్వేగానికి గురయ్యారు.
 
పెద్దపల్లి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనే నిర్ణయాన్ని ప్రకటించిన విజయ రమణారావు కంటతడిపెట్టారు. కన్నతల్లిలాంటి పార్టీని వీడక తప్పట్లేదని తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. పార్టీ సభ్యత్వానికి టి.టీడీపీ జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. వేరేదారిలేక ప్రస్తుతం పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకం‌‌ కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలు మొదలవుతున్నాయని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకం కావాలన్నారు. రోజుకో మాట పూటకో హామీ ఇస్తూ కాలం వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి మోసాలను ఇంటింటికి తిరిగి చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments