Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.28 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ: యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా అమాయక ప్రజలను..?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (21:03 IST)
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శివ ఆన్‌లైన్‌లో రూ.28 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చైనా మద్దతు ఉన్న ముఠా రూ.700 కోట్ల మేర మోసం చేసిందని విచారణలో తేలింది. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 
 
ఈ స్కామ్‌లో కొంత భాగాన్ని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు కూడా బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెవిన్ జున్, లు లాంగ్షో, షాషా అనే ముగ్గురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా భారత్‌లోని కొందరి సహకారంతో పనిచేస్తోంది. 
 
వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న పనులను పూర్తి చేయమని అమాయకులను అడగడం ద్వారా మోసం ప్రాసెస్ చేశారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి ఈ కుంభకోణానికి సూత్రధారులుగా అరెస్టయ్యారు. వివిధ బోగస్ కంపెనీల పేరుతో 48 బ్యాంకు ఖాతాల్లోకి 584 కోట్లు చెల్లించారు. తదుపరి విచారణలో వివిధ బ్యాంకు ఖాతాల్లో మరో రూ.128 కోట్లు అక్రమంగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది.
 
రూ.700 కోట్లకు పైగా మోసం జరిగింది. ఈ స్కామ్‌లో, ముఠా యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా అమాయక ప్రజలను టార్గెట్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments