మహేష్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రారంభం పూజా కార్యక్రమాలతో అమోఘంగా వుందని దర్శక నిర్మాతలు ఆరంభించారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా పలుమార్పులు చోటు చేసుకున్నాయి. సినిమాటోగ్రాఫర్ వినోద్ కొంతకాలం చేశాక మార్చేశారు. ఆ తర్వాత ఫైట్ మాస్టర్ కూడా మారిపోయాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ప్లేస్‌లో శ్రీలీల వచ్చింది. ఇప్పుడు మీనాక్షిని తీసుకుంటున్నట్లు వార్తలు బయటకు వచ్చేశాయి. పూజా హెగ్డే వ్యక్తిగత సమస్యతో షూటింగ్‌కు రాకపోవడంతో మహేష్ కూబా షూటింగ్‌ను వాయిదా వేశారు.
ఇన్ని జరుగుతున్నా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను 80 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే తాజాగా థమన్ మాట్లాడుతూ, గుంటూరు కారంకు బాణీలు సమకూర్చాలి. అంతకుముందు కొన్ని వినిపించాను. అవి ఫైనల్ రెండు మూడు రోజుల్లో అవుతుందని ఇటీవలే తెలిపారు. కానీ ప్రస్తుతం ఆయన ప్లేస్‌లో మరొకరు వస్తున్నట్లు నేడు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్‌గా గుంటూరు కారం చాలా హాట్ గురూ అనిపిస్తుందేమో చూడాలి.