Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెల రాజేందర్‌ చెక్.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు గాలం

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (17:27 IST)
L Ramana
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. ఆయనకు చెక్ చెప్పేందుకు అంతే వేగంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్.

ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయనను ఫోన్ ద్వారా టీఆర్ఎస్‌కు ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి టీడీపీలో కొనసాగిన ఎల్.రమణ.. టీడీపీ హవా ఉన్న రోజుల్లో మంచి విజయాలు సాధిస్తూ వచ్చారు.
 
అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైన తరువాత ఆయన కూడా పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వెళ్లిపోయారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడిన క్రమంలో పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది.
  
మరోవైపు టీటీడీపీని వీడేందుకు సిద్ధమైన ఎల్.రమణను చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోందని.. వారి కంటే ముందుగానే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోగా.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా పార్టీని వీడితే తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగైనట్టే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments