Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే ఆడి కారు... పక్కనే గర్ల్ ఫ్రెండూ... పీకల దాకా మద్యం తాగి కారు నడుపుతుంటే...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (15:49 IST)
వీకెండ్ వస్తే చాలు పీకల దాగా తాగి డ్రైవ్ చేసే మందుబాబుల ఆగడాలకు అదుపులేకుండా పోతుంది. పబ్బుల్లో ఫుల్లుగా తాగి గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి కారెక్కి ర్యాష్ డ్రైవ్ చేస్తూ రెచ్చిపోతున్నారు యువకులు. డ్రంకన్ డ్రైవ్ చిత్రీకరిస్తున్న మీడియాపై యువతీ యువకులు చిందులు తొక్కి హల్చల్ చేస్తున్నారు. 
 
తాజాగా మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి నండూరి కిరణ్‌ రెడ్డి, అను గుప్తాలు పూటుగా మద్యం సేవించి అనంతరం వేగంగా కారు నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో పలువురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు కిరణ్‌ రెడ్డి, అను గుప్తాలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 
ఇద్దరిని పోలీసులు విచారిస్తున్న సమయంలో పోలీస్‌ స్టేషన్‌లోని వస్తువులను పగులగొట్టి హంగామా సృష్టించారు. పోలీస్ స్టేషన్‌లో వీరి ఆగడాలను చిత్రీకరిస్తున్న రిపోర్టర్ల మీద కూడా తమ ప్రతాపం చూపించారు. గతంలో కూడా నండూరి కిరణ్‌ రెడ్డిపై కేసులు ఉన్నాయని, జూబ్లీహిల్స్‌లో పీడీయాక్ట్ నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments