సుబ్బరాజు తీగ లాగితే డొంక కదిలిందా? పూరీ చుట్టూ బిగిస్తున్న డ్రగ్స్ ఉచ్చు...

డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజు ఇచ్చే సమాచారం చాలా కీలకంగా వున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి ఇంకా సుబ్బరాజును విచారిస్తూనే వున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరింత సమాచారం సుబ్బరాజు నుంచి వస్తుందనీ, అందుకే కొద్దిసేపు ఆయ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (18:50 IST)
డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజు ఇచ్చే సమాచారం చాలా కీలకంగా వున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి ఇంకా సుబ్బరాజును విచారిస్తూనే వున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరింత సమాచారం సుబ్బరాజు నుంచి వస్తుందనీ, అందుకే కొద్దిసేపు ఆయనకు బ్రేక్ ఇచ్చి మళ్లీ విచారించనున్నామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.
 
హైదరాబాదులోని కొన్ని బార్లు, పబ్ సెంటర్లు, హుక్కా సెంటర్లలో డ్రగ్స్ లభ్యమవుతున్నట్లు తాము విచారించిన వారు చెపుతున్నారనీ, అందువల్ల రేపు వారిని విచారిస్తామన్నారు. తమ దృష్టిలోకి ఇలాంటి 16 సెంటర్లు వున్నప్పటికీ అందరినీ పిలిచి విచారించనున్నట్లు తెలియజేశారు.
 
ఇక నటి ముమైత్ ఖాన్ కు ఈ నెల 27న తమ ముందు హాజరు కావాలని తెలియజేసినట్లు చెప్పారు. రేపు ఉదయం నటుడు తరుణ్ ను విచారిస్తామన్నారు. కేసు వివరాలను అడిగినప్పుడు... ఇప్పుడే వాటిని చెప్పలేమనీ, దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత వాటి వివరాలను వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఇప్పటివరకూ విచారించినవారంతా పూరీ జగన్నాథ్‌కు సన్నిహితులు కావడంతో పూరీ కేంద్రంగా అన్ని జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments