మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డికి సైబర్ నేరగాళ్ల పేరుతో మాజీ కారు డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల రూపాయల మేరకు కొల్లగొట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బంజార్ హిల్స్‌ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నారు. ఇటీవల శృతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ.11 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని శృతి రెడ్డి ఆలస్యంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత బీసన్నపై అనుమానంతో ఆయన్ను నిలదీయగా, తాను చోరీ చేయలేదని బుకాయించాడు. దీంతో డ్రైవర్‌పై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments