Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల మహిళా రోగి పొట్ట నుంచి 12 కిలోల కాలేయం తొలగింపు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:12 IST)
భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి మూత్రపిండాల మార్పిడి చేశారు.
 
ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌లు, కిడ్నీ మార్పిడి సర్జన్‌తో సహా పేరెన్నికగన్న సర్జన్ల బృందం ఏకకాలంలో కాలేయం, మూత్రపిండాల మార్పిడిని నిర్వహించింది. నవంబర్ మొదటి వారంలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి గురువారం ప్రకటించింది.
 
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళను వైద్యులు కాపాడారు. ఆ మహిళ కాలేయం చాలా పెద్దదిగా వుండటంతో అది ప్రేగులను స్థానభ్రంశం చేస్తూ ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించింది. 
 
సాధారణ ఆరోగ్యకరమైన పరిస్థితులలో, కాలేయం గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ ఆమె కాలేయం భారీ సైజులో వుండటంతో ఆమె నానా తంటాలు పడింది. దీంతో ఆమె కాలేయాన్ని, కిడ్నీని ఒకేసారి మార్పిడి చేసినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments