Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ హత్య కేసు: నాలుగో నిందితుడిని చెడగొట్టిన మొదటి నిందితుడు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (20:21 IST)
దిశ అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిందితుల పూర్తి వివరాల గురించి వారి కుటుంబం గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నం చేస్తూ వుంది. అంత దారుణంగా నిందితులు ఎలా మారారు, వాళ్ల కుటుంబ నేపధ్యం ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నాలుగో నిందితుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
 
వారి మాటల్లోనే... అతడికి కిడ్నీ సమస్య వుంది. మాకు తెలిసి మా అబ్బాయి కోసం ఇంటి ముందుకు ఎవరు రారు. అంతా ఫోన్ ద్వారానే జరుగుతుంది. ఫోన్ చేసి తీసుకుని వెళతారు. అతడికి కిడ్నీ సమస్య వుండటంతో తింటాడు ఇంట్లోనే వుంటాడు. మేమంతా అతడిని కూలీ పని చేసి పోషిస్తున్నాం.
 
మాకు తెలిసి వాడికి అసుమంటి చేష్టలు లేవు. మొదటి నిందితుడే మావాడిని చెడగొట్టిండు. తాగిన మైకంలో ఏం చేశాడో తెలియదు అని అతడి తల్లి వెల్లడించారు. నిందితుడిని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్న యువతి మాట్లాడుతూ.. అతడికి అసుమంటి చేష్టలు లేవు. ఉంటే నేనెందుకు పెళ్లాడుతా. కిడ్నీ ట్రబుల్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పిండ్రు. అంతే, అప్పట్నుంచి అతడిని ఇంట్లోనే వుండమన్నాం. 
 
మొదటి నిందితుడు మధ్యాహ్నం లేపుకుని వెళ్లిండంట. లోడ్ వచ్చింది, పైసలు తీసుకెళ్దువ్ రా అని తీసుకెళ్లిండ్రు అంతే, నా భర్త తప్పు చేసిండు అని నిరూపణ అయితే నలుగురితో పాటు నా భర్తను ఉరి తీయండి. మా బతుకుదెరువు గింతె జూడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments