Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు ముఖం చూపించి చంపేసి వుంటే సంతోషపడేవాడిని: 'దిశ' నిందితుడు తండ్రి

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (19:12 IST)
దిశపై అత్యాచారం, ఆపై హత్యపై దేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దిశ నిందితులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న సమయంలో నిందితులు తిరగబటంతో ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చారు. 
 
మరి నిందితుల కుటుంబ సభ్యులు మాటేంటి? వాళ్లేమన్నారు అనేది చూస్తే, దిశ హత్య కేసులో నలుగురు నిందితుల్లో జొల్లు శివ అనే నిందితుడు తండ్రి ఎన్ కౌంటర్ పైన వ్యాఖ్యానించారు. తన కొడుకుని చంపేయడంపై తనకు అభ్యంతరం లేదనీ, అలాగే ఉరి తీసినా తనేమీ బాధపడనని కేసు గురించి తెలిసినప్పుడే చెప్పానన్నారు. 
 
ఐతే తన కుమారుడు శివ ముఖాన్ని ఒక్కసారి చూపించి, అతడితో నాలుగు ముక్కలు మాట్లాడే అవకాశం తనకు కల్పిస్తే సంతోషపడేవాడనని అన్నారు. అతడి ముఖం చూసిన తర్వాత పోలీసులు చంపేసి వుంటే ఆనందపడేవాడినని వెల్లడించారు. తన కుమారుడిని పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments