Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎలా.. మా ఆదాయం సంగతేంటి : మోడీతో కేసీఆర్

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. శనివారం ఢిల్ల

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:55 IST)
పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన కేసీఆర్‌.. పెద్దనోట్ల రద్దు పరిణామాలపై చర్చించారు. నోట్ల రద్దు మూలంగా సామాన్యులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని వృత్తులవారు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు. కేంద్రం నిర్ణయంలో రాష్ట్రాలను భాగస్వాములను చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రధానికి సూచించారు.
 
అంతకుముందు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేసీయఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెల్సిందే. ఇది ఏకపక్ష చర్య అని, ఇలాంటి నిర్ణయం వల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటూ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం వల్ల కలిగే నష్టాలను ప్రధానికి వివరించేదుకు శుక్రవారమే కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం ప్రధానితో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య గంటపాటు సాగింది. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేట్ వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments