Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (12:41 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కె.కవిత హాజరయ్యారు. ఇందుకోసం ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న కవిత.. సోమవారం ఉదయం 11 గంటలకు ముందే ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను కన్ ఫ్రంటేషన్ పద్ధతలితో విచారిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్‌లో ముఖ్యంగా సౌత్ గ్రూప్ వ్యవహారాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆందించినట్టు ఆరోపిస్తున్న వంద కోట్ల రూపాయల వ్యవహారంపై విచారిస్తున్నారు. 
 
అరుణ్ రామచంద్ర పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అన్న ఆరోపణల నేపథ్యంలో వివిధ ఆర్థిక లావాదేవీలపై ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ కేసులో పిళ్లై కస్టడీ సోమవారం మధ్యాహ్నానికి ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిళ్లైని తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి కవితను కన్ ఫ్రంటేషన్‌ పద్దతిలో విచారించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిళ్లై కస్టడీ ముగిసేలోపు కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments