Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క హస్కీ మృతి కేసు మిస్టరీ వీడింది..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:19 IST)
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార నివాసమైన ప్రగతిభవన్ లోని పెంపుడు కుక్క ‘హస్కీ’ మృతి కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఎట్టకేలకు మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 10వతేదీన సీఎం పెంపుడు కుక్క మరణించడంతో, ప్రగతిభవన్ అధికారులు దీనిపై సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హస్కీ కుక్క మృతికి ఇద్దరు పశువైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీలపై నగర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
 
దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ, పెంపుడు కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని కోరింది.
 
కాగా పెంపుడు కుక్క హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేయగా, అది సహజంగా అనారోగ్యంతోనే మరణించిందని తేలింది. దీంతో తాము ఇద్దరు పశువైద్యాధికారులపై పెట్టిన క్రిమినల్ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ సమర్పించారు.
 
11 నెలల హస్కీ కుక్క అనారోగ్యానికి గురవడంతో దాన్ని బంజారాహిల్స్ క్లినిక్ లో చేర్చారు. హస్కీ చికిత్స పొందుతూ మరణించడంతో పశువైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్క మరణించిందంటూ పోలీసులు ఐపీసీ సెక్షన్ 429 సెక్షన్ 11 (4) కింద జంతువులపై క్రూరత్వ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 
 
నిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చిరంతన్ కడియన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై కేసు నమోదు చేయడంపై పలువురు నెటిజన్లు కూడా వ్యతిరేకించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments