పులి ఎఫెక్టు... మేకలకు కూడా మాస్కులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:02 IST)
ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను కూడా పాటిస్తున్నారు. అలాగే, తమ పెంపుడు జంతువులకు కూడా ఇదేవిధంగా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని ఓ జంతు ప్రదర్శనశాలలోని ఓ పులికి కరోనా వైరస్ సోకింది. దీంతో తమతమ ఇళ్లలో ఉండే పెంపుడు జంతువుల పట్ల కూడా యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా క‌ల్లూరు మండ‌లం పేరువంచ గ్రామానికి చెందిన కాపరి కోటయ్య అనే వ్యక్తి మేక‌లే జీవ‌నాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ దెబ్బకు భయం పట్టుకుంది. మ‌నుషులం మ‌న‌మే జాగ్ర‌త్త తీసుకోలేకుంటే ఈ మూగ‌జీవాల ప‌రిస్థ‌తేంటి అనుకున్నాడో ఏమో. మేక‌ల య‌జ‌మానిగా వాటి బాధ్య‌త తానే తీసుకున్నాడు. మ‌నుషులు ఉప‌యోగించే మాస్కులు మాదిరిగానే ప్ర‌త్యేకంగా త‌యారు చేయించి 50 మేక‌లకు మాస్కులు తొడిగి మేపడానికి తీసుకెళ్లాడు. 
 
ఇవి మేత మేసేట‌ప్పుడు మిన‌హా, ఇత‌ర స‌మ‌యాల్లో మాస్కుల‌తో ముక్కు, నోటికి క‌ప్పుతున్నాడు. మేక‌లు, గోర్ల‌లో ఫ్లూ ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి స‌మ‌యాల్లో నిర్ల‌క్ష్యంగా ఉంటే క‌రోనానే కాదు మ‌రెన్నో ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించి.. కరోనా బారినపడకుండా కాపాడుకోవాలని సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments