Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు - బిల్లు చెల్లించలేదనీ...

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (14:21 IST)
కరోనాకు వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయి. కరోనా వైరస్ రోగులు పొరపాటున చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినపక్షంలో వారిని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఓ సంఘటన ఒకటి వెలుగు చూసింది. కరోనా చికిత్స చేసిన తర్వాత బిల్లు చెల్లించలేదన్న కోపంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ఓ మహిళా వైద్యురాలిని గదిలో నిర్బంధించారు. ఈ దారుణాన్ని ఆమె ఓ సెల్ఫీ వీడియో ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో సుల్తానా అనే ఓ మహిళ డీఎంవోగా పని చేస్తూ వస్తోంది. ఈమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంది. అయితే, ఆస్పత్రి సిబ్బంది కేవలం 24 గంటలకు 1.15 లక్షల రూపాయల బిల్లు వేసి, అది కట్టాలని ఒత్తిడి తెచ్చారు. అంత బిల్లు ఎందుకు చెల్లించాలంటూ ఆ మహిళ నిలదీయడంతో ఆమెను ఓ గదిలో ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. 
 
తనను హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు కార్చుతూ తెలిపారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments