వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే పార్టీకి నష్టం : రేవంత్‌పై జగ్గారెడ్డి ఫైర్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (13:50 IST)
వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే పార్టీకి అపారనష్టం వాటిల్లుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
రేవంత్ రెడ్డి జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు క‌నీసం గీతారెడ్డికి కూడా స‌మాచారం లేదని, వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికే ఆరాట‌ప‌డితే పార్టీలో కుద‌ర‌దని ఆయ‌న ఆరోపించారు. రేవంత్ సంగారెడ్డి జిల్లాకు వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని, విభేదాలు ఉన్నాయ‌ని చెప్పేందుకు స‌మాచారం ఇవ్వ‌ట్లేదా? అని ఆయ‌న నిల‌దీశారు.
 
పార్టీలో సింగిల్‌ హీరోగా ఉండాల‌నుకుంటే కుదరదని జగ్గారెడ్డి హితవు పలికారు. ఒక్కరి ఇమేజ్‌ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇది పార్టీనా లేక‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
పార్టీ నేత‌ల‌తో చర్చించకుండానే కార్య‌క్ర‌మాలు ఖ‌రారు చేసుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కాగా, రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments