దోషుల కాళ్లు - చేతులు నరికేస్తాం : తాలిబన్ తీవ్రవాదులు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (13:34 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులకు తమ పాత జులుంను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. వివిధ నేరాలకు పాల్పడి దోషులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేందు సిద్ధమయ్యారు. ముఖ్యంగా, నేరం చేసిన దోషుల కాళ్లు, చేతులు నరికేస్తామని ప్రకటించారు. 1990ల నాటిలాగే ఆఫ్ఘ‌న్‌లో ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబ‌న్లు తేల్చి చెబుతున్నారు.
 
తాలిబన్‌ వ్యవస్థాపక స‌భ్యుడు ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. త‌మ దేశ‌ అంతర్గత వ్యవహారాల్లో ఇత‌రులు జోక్యం చేసుకునే అవ‌స‌రం లేద‌ని చెప్పారు. త‌మ‌ చట్టాలు ఎలా ఉండాలనే విష‌యం వారు చెప్పకూడ‌ద‌న్నారు. తాము ఇస్లాంను అనుసరిస్తామ‌ని, ఖురాన్‌ ప్రకారమే చట్టాలు రూపొందించుకుంటామ‌ని, ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. 
 
ముఖ్యంగా, రెండు దశాబ్దాల క్రితం తాము ఆఫ్ఘ‌న్‌లో జ‌రిపిన ప‌రిపాలన తరహాలోనే ఇప్పుడు కూడా త‌మ దేశంలో దోషులకు కఠిన శిక్ష‌లు విధిస్తామ‌ని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఆ శిక్ష‌ల‌ను బహిరంగంగా అమలు చేయాలా? అన్న దానిపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments