Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోడిపుంజు కూతలతో చెవుల్లో దూది..?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:23 IST)
ఓ వ్యక్తి మృతి కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి మరి. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏ1 కోడి రాజాను స్టేషన్‌లో కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికేసేపు చెట్టుకిందకు మార్చేస్తున్నారు. ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. 
 
కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ కేసులో కోడిని త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు కోడిని కంటికిరెప్పలా చూసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments