Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సతీమణి శోభకు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (16:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు సతీమణి శోభ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమెకు కొన్ని వైద్యు పరీక్షల తర్వాత చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రులు కేటీఆర్, మంత్రి హరీశ్ రావులు ఆస్పత్రిలోనే ఉన్నారు. తన భార్య శోభతో పాటు సీఎం కేసీఆర్ కూడా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కేసీఆర్‌కు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే, వీరిద్దరి వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 
మరోవైపు, తన తల్లి అస్వస్థతకు లోనయ్యారన్న వార్తను తెలుసుకున్న ఎమ్మెల్సీ కె.కవిత హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసానికి ఆమె చేరుకున్నారు. మరోవైపు, శోభ ఆరోగ్యం నిలకడగానే వుంది. అయినప్పటికీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు ఆస్పత్రిలోనే ఉన్నారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా పాల్గొన్నారు. ఇందులో ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈ విచారణలో ఏం జరిగిందనే దానిపై వారు చర్చించినట్టు సమాచారం. అలాగే, ఈ నెల 16వ తేదీన కవితను మరోమారు విచారణకు రావాలని ఈడీ కోరింది. ఇంతలోనే శోభ అస్వస్థతకు లోనుకావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments