Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోలీకి పుట్టింటికి వెళ్లలేదని భార్య అలిగింది.. పది రోజులు సెలవు కావాలి..

Advertiesment
spoffice
, సోమవారం, 6 మార్చి 2023 (09:17 IST)
గత 22 సంవత్సరాలుగా తన భార్య హోళీ పండుగకు పుట్టింటికి వెళ్లలేదని అలిగిందని, అందువల్ల ఆమెను బుజ్జగించి పుట్టింటింటికి తీసుకెళ్లేందుకు తనకు పది రోజుల పాటు సెలవుకావాలంటూ ఓ ఇన్‌స్పెక్టర్ జిల్లా ఎస్పీకి ఓ లేఖ రాశాడు. ఈ లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత 22ఏళ్లుగా తన భార్యను హోలీకి పుట్టింటికి తీసుకెళ్లనందుకు అలిగిందని.. ఆమెను శాంతపరచాలంటే 10 రోజులు సెలవు కావాలని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తన లేఖలో పేర్కొన్నాడు. 
 
పోలీసు కొలువులో సెలవులు దొరకడం లేదని,. అందువల్ల వివాహమైన 22 ఏళ్ల నుంచి తన భార్యను హోలీ రోజున పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈసారి హోలీకి నా భార్య నాతో కలిసి పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. ఖచ్చితంగా నాకు సెలవులు అవసరం. సర్‌, నా సమస్యను పరిగణనలోకి తీసుకొని 10 రోజుల పాటు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను' అని ఇన్‌స్పెక్టర్‌ రాశాడు. ఈ లేఖను చదవిన ఎస్పీ.. ఇన్‌స్పెక్టర్‌ కోరినట్లు పది రోజులు కాకుండా.. ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూకాబాద్‌లో జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో పని చేసే ఇన్ ఛార్జ్ అండ్ ఇన్‌స్పెక్టర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీనాకు లేఖ రాశారు. గతంలో కూడా యూపీలోని మహారాజ్‌గంజ్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా తన భార్య నుంచి ప్రశాంతత కోసం పది రోజుల సెలవు కావాలంటూ లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈయన్ను ఆదర్శంగా తీసుకున్న ఇన్‌స్పెక్టర్ ఇపుడు సెలవు కోరుతూ లేఖ రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్బీఐ కస్టమర్ల ఖాతాల నుంచి రూ.295 కట్.. ఎందుకో తెలుసా?