Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ - గ్రామ అభివృద్ధిపై ఆరా

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (07:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న గ్రామ సర్పంచ్‌ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం అవసరమయ్యే నిధులు, దళితబంధు అమలు తదితరాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
అలాగే, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని ఆయన గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం కింద గ్రామంలో ఎంపికైన లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 
 
గ్రామంలో అర్హులైన అందరికీ దళితబంధు అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. వారంలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments