మునుగోడులో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏం చేస్తారో?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (18:31 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడులో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం తర్వాత ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభలో విరుచుకుపడతారని సమాచారం. ఫామ్‌హౌస్‌ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను, కోణాలను సీఎం కేసీఆర్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది. 
 
బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్.. ఫామ్‌హౌస్‌ డీల్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ డీల్‌పై మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. 
 
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోనూ ఈ డీల్‌పై చర్చించారు. మరోవైపు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

తర్వాతి కథనం
Show comments