కోదండరామ్ కనీసం సర్పంచ్ అయ్యాడా? రాజకీయాల్లోకి వచ్చేయాలి : కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరుల స్ఫూర్తి యాత్ర అని రాజకీయం చేశాడని, ఓట్ల రాజకీయం కావాలంటే కోదండరామ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్నారు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (17:16 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరుల స్ఫూర్తి యాత్ర అని రాజకీయం చేశాడని, ఓట్ల రాజకీయం కావాలంటే కోదండరామ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయకూడదన్నారు. సింగరేణి ఫలితాలు చూసైనా మారాలని.. 2019లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందన్నారు.
 
హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కోదండ‌రాం ఇన్నేళ్ల‌లో క‌నీసం స‌ర్పంచ్ అయినా అయ్యాడా? అని ప్ర‌శ్నించారు. కోదండ‌రామ్ త‌న‌ను తాను ఎక్కువ‌గా ఊహించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తెరాస పార్టీ అధికారంలో వున్నంత కాలం ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జ‌రిగాయ‌ని, తాము స‌మ‌ర్థ‌వంతంగా పాలిస్తున్నామ‌న్నారు. 
 
కోదండరామ్ జెండా, అజెండా ఏంటని.. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కోదండరామ్ ఎజెండానా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది నిజం కాదా? అబ‌ద్ధ‌మా? అని అన్నారు. కోదండ‌రామ్‌ది విష‌పూరిత మ‌న‌స్తత్వ‌మ‌ని, ఆయన తెరాస వ్యతిరేకి అని కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments