Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:59 IST)
నేటి విద్యార్థులలో అసాధారణ ప్రతిభ వుంది. చేయాల్సిందల్లా వారి ప్రతిభకు మెరుగులద్దటం, వారి నైపుణ్యం ప్రదర్శించుకునే వేదిక అందించటం. అలాంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాలు, అత్యుత్తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వేదికగా ఖమ్మంలో నిర్వహించిన NXplorers కార్నివాల్ నిలిచింది. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపికైన 74 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథమెటిక్స్) రంగాలలో తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. వందలాది ఎంట్రీల నుండి ఎంపిక చేయబడ్డ మొత్తం 23  "మార్పు ప్రాజెక్ట్‌లు" ఇక్కడ ప్రదర్శించబడ్డాయి 
 
షెల్‌కు చెందిన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ విద్యా కార్యక్రమం NXplorers జూనియర్ ప్రోగ్రామ్. ఇది యునైటెడ్‌నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(SDGలు)లో వెల్లడించినట్లుగా, స్థానిక మరియు గ్లోబల్ సవాళ్లను అర్థం చేసుకోవడం, నావిగేట్ చేయడం మరియు పరిష్కరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020కి కూడా అనుగుణంగా ఉంది.
 
పద్మశ్రీ అవార్డు గ్రహీత  మరియు సామాజిక ఉద్యమ కారులు శ్రీ దరిపల్లి రామయ్య మాట్లాడుతూ," పాఠశాల స్థాయిలో చేస్తున్న మంచి పనికి స్మైల్ ఫౌండేషన్‌ను తాను అభినందిస్తున్నాను." అని  అన్నారు. స్మైల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అవిభాజ్యపు వరంగల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలతో పాటుగా కేరళలోని త్రిసూర్ జిల్లాలో మొత్తం 203 పాఠశాలల్లో అమలు చేస్తోంది. ఇది 6 మరియు 7 అకడమిక్ గ్రేడ్‌లలోని 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 25,000 మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
 
ఖమ్మం జిల్లా స్థాయి కార్నివాల్ సందర్భంగా, ప్రదర్శించిన నమూనాలలో అధిక శాతం ప్రాజెక్ట్స్ నీటి పరి రక్షణ, నీటి వనరులను మెరుగ్గా వినియోగించుకోవటం, ఇంధన, ఆహార విభాగాలకు సంబంధించినవి వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments