అక్టోబర్ అయితే సెలవులే సెలవులు. దసరా సెలవులు కూడా ఈనెలలో ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఏపీలో అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు.
అక్టోబర్ 1 ఆదివారం సెలవు. అలాగే.. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రైవేటు ఉద్యోగులకైతే శనివారం- సెప్టెంబర్ 30 సెలవు ప్రారంభమవుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.