Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30-09-2023 శనివారం రాశిఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని ఆరాధించిన శుభం..

astro8
, శనివారం, 30 సెప్టెంబరు 2023 (04:00 IST)
మేషం :- విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ధనం బాగా వ్యయం చేసి అనుకున్నపనులు పూర్తి చేస్తారు. చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం :- ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం :- సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసివస్తుంది. ఎదుటివారి వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వీడిన సత్ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు సాహస ప్రయత్నాలు విరమించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోర్టు వాయిదాలు వాయిదా పడటం మంచిది.
 
సింహం :- ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు, నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు ప్రారంభంలో నెమ్మదించినా సమయానికి పూర్తిచేయ గలుగుతారు.
 
కన్య :- దూర ప్రయాణం తలపెడతారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఆకస్మిక ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. గృహనిర్మాణ పనులు ప్రారంభంలో మందగించినా క్రమేపి వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. 
 
తుల :- ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. సినిమా, కళా, రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. దుబారా ఖర్చులు అధికం.
 
వృశ్చికం :- వీలైనంత వరకూ మీ పనులుమీరే చూసుకోవటం ఉత్తమం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. గృహనిర్మాణాలు, మార్పులు, చేర్పులు, మరమ్మతులకు అనుకూలం. సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికిసామాన్యం.
 
ధనస్సు :- బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. పెట్టుబడులకు అనుకూలం.
 
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
కుంభం :- మీ సంతానం విషయంలో ఓర్పు, నేర్పు చాలా అవసరం అని గమనించండి. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ నిరుత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది.
 
మీనం :- మీ కృషికి కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలలో సంతృప్తి కానరాదు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-09-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించిన శుభం...