Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-09-2023 బుధవారం రాశిఫలాలు - అమ్మవారిని ఆరాధించిన శుభం...

Advertiesment
astro4
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు|| త్రయోదశి రా.8.49 శతభిషం తె.4.26 ప.వ.12.47 ల 2.16. ప.దు. 11.33 ల 12.23.
 
అమ్మవారిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, విజ్ఞత ఎంతో అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్ధులలో పట్టుదల, విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ ప్రత్యర్దులు వేసేపథకాలు ధీటుగా ఎదుర్కుంటారు.
 
వృషభం :- బంధు మిత్రుల రాకపోకలుంటాయి. అధ్యాపకులకు పురోభివృద్ధి, విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఇతరులకారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
మిథునం :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. స్త్రీల మనోభావాలకు, పనితనానికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవదర్శనం చేస్తారు.
 
కర్కాటకం :- నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.
 
సింహం :- విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. ఏదైనా అమ్మకానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు.
 
కన్య :- ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా ఏ పని చేయటం క్షేమం కాదని గమనించండి. అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రేమికుల మధ్య అపార్ధాలను తొలగిపోతాయి. సోదరీ సోదరుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సాగక విసుగు కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు.
 
వృశ్చికం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
ధనస్సు :- మార్కెటింగ్, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, శ్రమ అధికం. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. స్థానచలనానికై చేయు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.
 
కుంభం :- సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పదు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోనవలసి వస్తుంది.
 
మీనం :- మీ కుటుంబానికిమీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళ, శుక్రవారాల్లో రసం, కాకరకాయ, ఆకుకూరలు వండితే?