Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:41 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో భారత్ బయోటెక్ ఛైర్మన్&ఎండీ కృష్ణా ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా కలిశారు. 
 
కరోనా వ్యాక్సిన్ స్థితి, భారత్​ దేశంలో, ప్రపంచంలో కొవాగ్జిన్​ను​ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలను చర్చించారు. ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్​), నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీ(ఎన్​ఐవీ)లతో కలిసి ఈ వ్యాక్సిన్​ను తయారు చేసినట్లు ఉపరాష్ట్రపతికి కృష్ణా ఎల్లా తెలిపారు. 
 
భారత్​ బయోటెక్​లోని బీఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైన్మెంట్ సదుపాయంలో స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ భారత్​ బయోటెక్​ను సందర్శించి కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ స్థితిపై సమీక్షించినట్లు వెంకయ్యకు వారు తెలిపారు. 
 
జీనోమ్​ వ్యాలీలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాల గురించి తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు సందర్శించినట్లు వెల్లడించారు.
 
ప్రపంచస్థాయి ఉత్పత్తుల్లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం గురించి ఉపరాష్ట్రపతి భారత్ బయోటెక్ ఛైర్మన్​​కు వివరించారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్​ల పరస్పర సహకారాన్ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments