Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లెక్కుతారు జాగ్రత్త!: ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (18:59 IST)
ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశమంతా ధాన్యం సేకరణ విధానం ఒకేలా వుండాల్సిన అవసరం వుందన్నారు. ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐకి సరైన విధానమంటూ లేదని మండిపడ్డారు. 
 
దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణలోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని కవిత హెచ్చరించారు. 
 
ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్‌సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల‌ నుంచి ఒక పద్దతి ‌లేకుండా ధాన్యాలను కొంటోందన్న ఎమ్మెల్సీ కవిత.. ప్రతి ఏడాది ఎఫ్‌సీఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదన్నారు ఎమ్మెల్సీ కవిత. రైతుల నుంచి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అంటూ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments