రెండో ధనిక రాష్ట్రంలో గేదెలకు బీమా...

దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో మనుషుల సంగతి ఏమోగానీ, పశువుల సంరక్షణకు మాత్రం ఆ సర్కారు మంచి నిర్ణయాలే తీసుకుంటోంది. తాజాగా గేదెలకు బీమా సౌకర్యం కల్పించింది.

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (08:22 IST)
దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో మనుషుల సంగతి ఏమోగానీ, పశువుల సంరక్షణకు మాత్రం ఆ సర్కారు మంచి నిర్ణయాలే తీసుకుంటోంది. తాజాగా గేదెలకు బీమా సౌకర్యం కల్పించింది. అతి త‌క్కువ ప్రీమియంతో బీమా స‌దుపాయాన్ని రైతు ముందుకు తీసుకువ‌చ్చింది. కేవ‌లం రూ.630 ప్రీమియం చెల్లిస్తే చాలు మూడేళ్ల వ‌ర‌కు బ‌ర్రెకు, ఆవుకు బీమా స‌దుపాయం క‌ల్పించింది. 
 
ప‌శువు మృతిచెందితే గ్రామానికి చెందిన ప‌శు వైద్యాధికారికి స‌మాచారం అందిస్తే పంచ‌నామా నిర్వ‌హించి బీమా కంపెనీకి సిఫార‌సు చేస్తారు. దీంతో రైతు ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా ప‌రిహారం పొందే అవ‌కాశం ఉంటుంది. ఐదు సంవ‌త్స‌రాలు నిండిన ప‌శువుల‌న్నింటికి ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద దేశ‌వాళీ, సంక‌ర‌జాతి, చూలు క‌ట్టిన‌, పాడి ప‌శువుల‌కు వ‌ర్తిస్తుంది. 10 సంవ‌త్స‌రాల‌లోపు, ఐదు సంవ‌త్స‌రాల పైబ‌డిన ప‌శువుల‌కు మాత్ర‌మే ఈ బీమా వ‌ర్తిస్తుంది.
 
వాస్తవానికి గతంలో రూ.60 వేల విలువ గ‌ల పాడి ప‌శువుకు గ‌త ఏడాది బీమా చేయించాలంటే రూ.2500 చెల్లించాల్సి వ‌చ్చేది. ఈ ప్రీమియం చెల్లించాలంటే రైతుల‌కు భారంగా ఉండేది. దీంతో ప్రీమియం మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గణనీయంగా తగ్గించారు. ఇందుకోసం సునందిని అనే పథకాన్ని పెట్టి ప్రవేశపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments