Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు.. భూమా అఖిలప్రియ అరెస్ట్?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (12:50 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ కోసం ఆమెను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.
 
ఈ కేసుతో సంబంధం ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్న నాటి నుంచే ఈ భూ వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది. 
 
మరోవైపు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి బాధితులు ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులు నవీన్ రావు, సునీల్ రావు వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. 
 
రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments