Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నలుగురు డిప్లొమా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు వెళ్లి చనిపోయారు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న చక్రాల ప్రవీణ్ తన పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులతో కలిసి కోదాడలోని పెద్ద చెరువు కట్టమీద గల గుడి వద్ద చేసుకున్నారు. 
 
వారంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత సమీర్ అనే యువకుడు చేతులు కడుక్కునేందుకు చెరువులోకి దిగి నీటి వద్దకు వెళ్లాడు. అపుడు ప్రమాదవశాత్తు పట్టుకోల్పోయి చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో మరో ఇద్దరు చెరువులోకి దిగారు. 
 
లోతు ఎక్కు వగా ఉండడంతో చక్రాల ప్రవీణ్(18), హుజూర్ నగర్‌కు చెందిన భవాని ప్రసాద్ (17), నేరేడుచర్లకు చెందిన సమీర్ (17), ఖమ్మం జిల్లా పైనంపల్లికి చెందిన మహీందర్ (17) మృతిచెందారు. ఈ సంఘటనతో భయపడిన మిగిలిన స్టూడెంట్స్​ అక్కడి నుంచి పరారయ్యారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చెరువులో నుంచి నలుగురి తదేహాలను వెలికితీశారు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం మొత్తం విషాదం అలముకుంది. పుట్టినరోజు నాడే ప్రవీణ్ మృతిచెందడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments