Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కువైట్‌లో భర్త మృతి... 39 ఏళ్లుగా కుమార్తె కోసం ఆ తల్లి...

కువైట్‌లో భర్త మృతి... 39 ఏళ్లుగా కుమార్తె కోసం ఆ తల్లి...
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:55 IST)
భారతీయ మహిళ కువైట్ జాతీయుడిని వివాహం చేసుకుని బిడ్డకు జన్మనిచ్చింది. భర్త ప్రమాదంలో చనిపోయాడు. చివరకు బిడ్డను కువైట్‌లోనే విడిచి రావలసివచ్చింది. బిడ్డ కోసం 39 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఓ తల్లి విషాద గాధ ఇది. ఆమె బిడ్డ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ చాంద్రయణగుట్టకు చెందిన ఫాతిమా బేగమ్ 1978లో కువైట్ జాతీయుడైన మహ్మద్ హిజాబ్‌ అలాజ్మీని హైదరాబాద్‌లో వివాహం చేసుకుంది. 
 
పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ కువైట్ వెళ్లిపోయారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు అతడు ఆమెను భారత్‌కు పంపించాడు. 1979లో ఫాతిమా సలేహాకు జన్మినిచ్చింది. తర్వాత వచ్చి తీసుకువెళతానని చెప్పిన భర్త ఎంతకూ రాలేదు. ఉత్తరాలు వ్రాసినా జవాబు లేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె కువైట్‌లోని ఇండియన్ ఎంబస్సీకి భర్త ఆచూకీని చెప్పమని దరఖాస్తు చేసుకుంది. 
 
అందిన వివరాల ప్రకారం అలాజ్మీ సౌదీ అరేబియాలోని దమమ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అలాజ్మీ మొదటి భార్య కుమారుడు 1980లో భారత్‌కు వచ్చి ఫాతిమాను, సలేహాను కువైట్ తీసుకెళ్లాడు. అప్పటికి సలేహా వయసు ఏడాది మాత్రమే. కువైట్ వెళ్లిన ఫాతిమా పరిస్థితి దయనీయంగా మారింది. భర్త చనిపోయాక వచ్చే ప్రయోజనాలన్నీ మొదటి భార్యకే చెందాయి. కువైట్‌లో ఉండలేని పరిస్థితి, భారత్‌కి రావడం కుదరదు. తీవ్ర మనస్తాపానికి లోనైన ఫాతిమా పలుమార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో 1981లో అలాజ్మీ కొడుకు తనను ఇండియాకు తీసుకొచ్చి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వదిలేశాడు. 
 
సలేహా మాత్రం అక్కడే ఉండిపోయింది. 1987లో కూతురి కోసం మరోసారి కువైట్ వెళ్లింది. ఎంత వెతికినా ఆచూకీ తేలలేదు. అక్కడ స్థిరపడిన భారతీయుడ్ని వివాహం చేసుకుంది. 1991 కువైట్-ఇరాక్ యుద్ధ సమయంలో తిరిగి భారత్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అప్పటి నుండి కూతురి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరో ప్రయత్నంగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వీడియోని షేర్ చేసింది. 
 
అందులో తాను చనిపోకముందే తన కూతురిని చూడాలనుకుంటున్నాను అని తెలిపింది. కూతురి ఆనవాళ్లు తెలిపే వివరాలను కూడా పొందుపరిచింది. 39 సంవత్సరాలుగా కూతురి కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపింది. సోమవారం (ఫిబ్రవరి 25) కువైట్‌లోని ఇండియన్ ఎంబస్సీని కూడా సంప్రదించింది. ఆవసరమైన డాక్యుమెంట్‌లను పంపింది. వాటిని సామాజికవేత్త అమ్జత్ ఉల్లాఖాన్ ద్వారా స్వీకరించినట్లు ఇండియన్ ఎంబస్సీ ధృవీకరించింది. మరి ఆమె కుమార్తె ఆచూకి లభిస్తుందా... ఆమె ఆశ నెరవేరుతుందా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగార సామర్థ్యం కోసం పచ్చకర్పూరాన్ని తమలపాకుల్లో పెట్టి..?