Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగార సామర్థ్యం కోసం పచ్చకర్పూరాన్ని తమలపాకుల్లో పెట్టి..?

శృంగార సామర్థ్యం కోసం పచ్చకర్పూరాన్ని తమలపాకుల్లో పెట్టి..?
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (17:47 IST)
పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస్త వెన్నను కాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి.
 
మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలి అంటే ఇలా చేయాలి. పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగివేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు. కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రాని తయారుచేసుకోవచ్చు. 
 
సహజసిద్ధంగా ఎలా తయారుచేసుకోవచ్చంటే.. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి చిన్నచిన్న గింజలుగా చేయాలి. అంటే బఠాణి గింజంత మాత్రలుగా చేయాలి. వీటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక లైంగిక సామర్ద్యం కూడా మెరుగవుతుంది.
 
నిత్యం వెల్లుల్లి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని ఈమధ్య జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా వెల్లుల్లికి ఉందని నిరూపించబడింది. రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్ ఫోటో చూస్తూ నాతో శృంగారం చేస్తున్నాడు... ఏం చేయాలి?