Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రంగంలో మొదటి ఆడ రోబో.. అది చేసే పనేంటో తెలిస్తే షాకవుతారు

ఈ రంగంలో మొదటి ఆడ రోబో.. అది చేసే పనేంటో తెలిస్తే షాకవుతారు
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:35 IST)
ఇటీవలి కాలంలో రోబోలపై వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక రంగాలలో రోబోల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇటీవల రెస్టారెంట్‌లలో సర్వర్లకు బదులుగా రోబోలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు రోబోలు న్యూస్ యాంకర్లుగా కొత్త అవతారం ఎత్తారు. చైనాలో మీడియా సంస్థ జిన్హువా గత సంవత్సరం నవంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసేలా రూపొందించిన రెండు రోబోలను న్యూస్ యాంకర్లుగా నియమించింది. అప్పటి నుంచి ఆ రోబోలు వార్తలు చదువుతున్నాయి.
 
తాజాగా వీటి జతకు ఒక ఆడ రోబో వచ్చి చేరింది. దాని పేరు షిన్‌ షియావోమెంగ్‌. ఈ రోబో అచ్చం మనిషిలాగే ఉంది, మనిషిలాగే వార్తలు చదువుతోంది. ఇప్పటికి ఈ రోబో చైనీస్ భాషలో వార్తలు చదివేలా మాత్రమే రూపొందించబడింది. అంతేకాకుండా తొలి లేడీ రోబో న్యూస్ యాంకర్‌గా రికార్డులకెక్కింది. చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో, చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా సంయుక్తంగా రూపొందించిన రెండు ఏఐ ఆధారిత రోబోలలో ఒకటి చైనీస్ భాషలో వార్తలను చదవడానికి, మరొకటి ఇంగ్లీష్ భాషలో వార్తలు చదవడానికి ఉపయోగిస్తున్నారు.
 
ఇవి బ్రేక్ లేకుండా 24 గంటలూ పని చేస్తాయి, కాబట్టి బ్రేకింగ్ న్యూస్‌ను వీటి ద్వారా వేగంగా చేరవేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ రోబోలు సుమారుగా 3,400 వార్తలను చదివి వినిపించాయి. ఇప్పటివరకు కూర్చుని మాత్రమే వార్తలు చదివే ఈ రోబోకు కొత్త ఫీచర్లను జోడించడంతో నిలబడి వార్తలు చదవగలుగుతుందని, మరిన్ని ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్ స్ట్రైక్స్ ఓవర్.. వాట్ నెక్స్ట్ .. ప్రధాని హైలెవల్ మీటింగ్